ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పెళ్లి తర్వాత మొదటిసారి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన ఆమె, స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. దర్శనం అనంతరం ఆలయం బయటకు వచ్చిన కీర్తి సురేష్‌ను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొందరు సెల్ఫీలు, ఫోటోలు తీసేందుకు ప్రయత్నించడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, పెళ్లి తర్వాత తిరుమల దర్శనం తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు. అదే రోజు ఆమె శ్రీకాళహస్తి ఆలయాన్ని కూడా కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. అక్కడ రాహు కేతు పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీర్వాదాలు పొందారు. ఆలయ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news