ఇన్స్టాగ్రామ్ రీల్స్‌తో పాపులర్ అయిన శ్రీదేవి, ‘కోర్ట్’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తన క్యూట్ నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు ఆమె కోలీవుడ్‌లో అడుగు పెడుతూ ‘హైకూ’ అనే తమిళ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ బహుభాషా చిత్రంలో ఏగన్, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నాలుగు షెడ్యూళ్లలో 90 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. డైరెక్టర్ యువరాజ్ చిన్నసామి ఈ సినిమాను భావోద్వేగాలతో నిండిన కథగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. నిర్మాతలు కూడా సినిమా ఔట్పుట్ చాలా బాగా వచ్చిందని, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విడుదల తేదీపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Fetching videos...
Fetching latest news...
No trending news