Homeసినిమానాగ చైతన్య షాకింగ్ కామెంట్.. బెస్ట్ కెమిస్ట్రీ ఆమె..
నాగ చైతన్య షాకింగ్ కామెంట్.. బెస్ట్ కెమిస్ట్రీ ఆమెతోనే అంటూ
Updated 1 hours ago
అక్కినేని నాగ చైతన్య తన కెరీర్లో ఇప్పటివరకు 27 సినిమాల్లో, 20 మందికి పైగా హీరోయిన్స్‌తో నటించాడు. అయితే తనకు ఇప్పటికీ బెస్ట్ కెమిస్ట్రీ వర్కౌట్ అయిన హీరోయిన్ ఎవరు అనే ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగ చైతన్య తన కెరీర్లో ఎక్కువగా లవ్ స్టోరీ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇటీవల తండేల్ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆయన, ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాత ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. అందులో తనకు అత్యుత్తమ కెమిస్ట్రీ వర్కౌట్ అయిన హీరోయిన్గా యంగ్ బ్యూటీ కృతిశెట్టి పేరు చెప్పాడు. ఈ వ్యాఖ్యలు ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేశాయి. నాగ చైతన్య–కృతిశెట్టి జోడీపై అప్పట్లో వచ్చిన రెస్పాన్స్‌ను గుర్తుచేస్తూ అభిమానులు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు.