కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పెస్టిసైడ్ ఆధారిత వ్యవసాయం వల్ల సమాజంపై పడుతున్న ప్రభావాన్ని ప్రధానాంశంగా తీసుకున్న ఈ చిత్రం, ఆహార భద్రత మరియు ప్రజారోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా రూపొందుతోంది. టీజర్లో కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే న్యాయం కోసం పోరాడుతూ, వ్యవసాయ రంగంలో దాగి ఉన్న ప్రమాదకర నిజాలను బయటపెట్టే పాత్రల్లో కనిపించారు. రోజువారీ ఆహారంలో చేరుతున్న విషపూరిత రసాయనాలు, ముఖ్యంగా యువత ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావాన్ని కథలో చూపించారు. జీ స్టూడియోస్ సమర్పణలో, చేతన్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 జూలై 24న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. కాజల్ ఈ సినిమా తనకు ఎంతో వ్యక్తిగతంగా కనెక్ట్ అయిందని, ఒక తల్లిగా ఈ కథ ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news