2018లో విడుదలైన బాలీవుడ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘అంధాధున్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమాగా నిలిచింది. కేవలం రూ.32 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.456 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, తన కథనం, ట్విస్టులు, సస్పెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించగా, టబు, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో మెరిశారు. కళ్లులేని పియానో వాయిద్యకారుడి జీవితంలో జరిగే అనూహ్య సంఘటనలు, హత్య కేసు చుట్టూ తిరిగే కథ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రతి సన్నివేశం టెన్షన్‌తో పాటు ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూ ఈ సినిమాను విపరీతంగా ఆదరించారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ‘మాస్ట్రో’ పేరుతో రీమేక్ చేసినప్పటికీ, ఒరిజినల్ వెర్షన్ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
Fetching videos...
Fetching latest news...
No trending news