తెలంగాణకు చెందిన ప్రముఖ ఫోక్ సింగర్ నాగదుర్గ వెండితెరపై హీరోయిన్గా అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆమె గురించి నిర్మాత బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రియదర్శి హీరోగా, సుకుమార్ రైటింగ్స్–బన్నీ వాసు వర్క్స్ బ్యానర్లపై రూపొందుతున్న 'ఇడుపు కాయితం' సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాగదుర్గకు హీరోయిన్ అవకాశం ఇవ్వగా, ఆమె తనకు దాదాపు 15 షరతులు పెట్టిందని తెలిపారు. తాను చేయగలిగేది, చేయలేనిది అనే విషయంలో నాగదుర్గ ఎంతో స్పష్టంగా మాట్లాడడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, ఒక తెలుగు అమ్మాయి ఇంత ప్రొఫెషనల్‌గా ఉండటం ఆనందంగా అనిపించిందని చెప్పారు. నాగదుర్గ ఈ చిత్రానికి చాలా కీలకమని, ఆమెపై చిత్రబృందానికి పూర్తి నమ్మకం ఉందని వెల్లడించారు. ఇప్పటికే తమిళంలో హీరోయిన్గా నటిస్తున్న నాగదుర్గ, ఇప్పుడు తెలుగు సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. బన్నీ వాసు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news