T
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక కామెడీ టైమింగ్తో గుర్తింపు పొందిన నటుడు కృష్ణ భగవాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్ ప్రారంభ రోజుల జ్ఞాపకాలను పంచుకున్నారు. నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో హీరో రవితేజ, వేణు తొట్టెంపూడి, దర్శకుడు వైవీఎస్ చౌదరి తదితరులతో కలిసి ఒకే అద్దె ఇంట్లో నివసించేవాళ్లమని చెప్పారు. ఇంటి యజమానికి కుక్కలు పెంచడం అంటే ఎంతో ఇష్టమని, రాత్రిళ్లు షూటింగ్ల నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చే తమకు ఆ కుక్కల భయం పెద్ద సమస్యగా మారేదని గుర్తుచేశారు. చాలాసార్లు గేటు తెరవకుండా గోడలు దూకి ఇంట్లోకి వెళ్లాల్సి వచ్చేదని నవ్వుతూ తెలిపారు. సినీ జీవితంలోని కష్టాలు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలు ఇప్పటికీ మరువలేనివని చెప్పారు. ప్రస్తుతం జబర్దస్త్ షోకు జడ్జీగా వ్యవహరిస్తున్న కృష్ణ భగవాన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవితేజతో కలిసి నటించిన వెంకీ, దుబాయ్ శీను వంటి చిత్రాల జ్ఞాపకాలను అభిమానులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news