దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనతో పాటు మల్లీ పాత్రలో కనిపించిన చిన్నారి కూడా తన అమాయకపు నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. సినిమా కథకు కీలకంగా నిలిచిన ఈ పాత్ర ఇప్పటికీ అభిమానుల మదిలో నిలిచిపోయింది. తాజాగా మల్లీగా నటించిన చిన్నారి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటి అమాయక రూపానికి భిన్నంగా ఇప్పుడు ఎంతో అందంగా, హీరోయిన్లా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె రూపంలో వచ్చిన మార్పును చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ, "ఇంత పెద్దదైపోయిందా?", "హీరోయిన్లా ఉంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో మల్లీ లేటెస్ట్ లుక్ మరోసారి ఆర్ఆర్ఆర్ జ్ఞాపకాలను అభిమానులకు గుర్తు చేస్తోంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ వైరల్గా మారాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news