కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ తన ఆరోగ్యంపై వస్తోన్న వదంతులకు స్వయంగా చెక్ పెట్టాడు. గత మూడు నుంచి నాలుగు సంవత్సరాలుగా తాను ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. చికిత్సలో భాగంగా తీసుకుంటున్న మందుల కారణంగానే తన ముఖంలో అలసట, శరీరంలో మార్పులు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కనిపిస్తున్నాయని వివరించాడు. ఆరోగ్యమే తనకు తొలి ప్రాధాన్యత అయినప్పటికీ, అభిమానులు మరియు చిత్రబృందంపై ఉన్న బాధ్యతతోనే 'గట్ట కుస్తీ 2 (మట్టి కుస్తి)' సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నానని తెలిపాడు. తనపై ప్రేమ, అభిమానాన్ని చూపిస్తూ సందేశాలు పంపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన విష్ణు విశాల్, ఈ క్లిష్ట సమయంలో అభిమానుల మద్దతే తనకు ధైర్యాన్నిస్తోందని భావోద్వేగంగా పేర్కొన్నాడు. ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మద్దతు తెలుపుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news