హీరో రామ్ పోతినేనితో రిలేషన్షిప్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వేళ నటి భాగ్యశ్రీ బోర్సే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, హైదరాబాద్‌తో తన అనుబంధంపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ యాంకర్ సుమ నిర్వహించిన కార్యక్రమంలో భాగ్యశ్రీ మాట్లాడుతూ, “నా ఫస్ట్ హోమ్ ఔరంగాబాద్. నా సెకండ్ హోమ్ హైదరాబాద్. అది ఇప్పటికే నా రెండో ఇల్లుగా మారిపోయింది” అని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు వినగానే కార్యక్రమంలో ఉన్నవారు చప్పట్లతో స్వాగతించగా, సుమ కూడా సరదాగా స్పందించారు.
“కంగ్రాట్స్.. హైదరాబాద్‌కు స్వాగతం. చాలా మంది ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నారు. మీరు కూడా ఇక్కడే సెటిల్ కావాలని కోరుకుంటున్నాను” అని సుమ చెప్పడంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా హీరో అఖిల్ అక్కినేని కూడా చిరునవ్వులు చిందించడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఇటీవల భాగ్యశ్రీ బోర్సే, రామ్ పోతినేని మధ్య రిలేషన్షిప్ ఉందంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఇద్దరూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ భాగ్యశ్రీ చేసిన “హైదరాబాద్ నా రెండో ఇల్లు” వ్యాఖ్యలను నెటిజన్లు వివిధ కోణాల్లో విశ్లేషిస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు పెరుగుతుండటంతో భాగ్యశ్రీ బోర్సే హైదరాబాద్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.
Fetching videos...
Fetching latest news...
No trending news