బాపట్లలో ఏర్పాటు చేసిన “జెడ్ కార్ బాపట్ల కన్సల్టెన్సీ” షోరూమ్‌ను సోమవారం నిజాంపట్నం జడ్పీటీసీ సభ్యుడు నర్రా సుబ్బయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ నిర్వాహకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా నాణ్యమైన, మెరుగైన కార్ కన్సల్టెన్సీ సేవలను అందించాలని ఆకాంక్షించారు.
వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశ్వసనీయమైన సేవలు అందిస్తూ సంస్థ అభివృద్ధి చెందాలని నర్రా సుబ్బయ్య కోరారు. స్థానికంగా మెరుగైన సేవలు అందించడం ద్వారా వినియోగదారుల ఆదరణ పొందాలని సూచించారు.
కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం యువజన బాపట్ల జిల్లా అధ్యక్షుడు పచ్చపట్ల గంగరాజు, నిజాంపట్నం పీఏసీఎస్ అధ్యక్షుడు నరేష్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం యువజన నిజాంపట్నం మండల అధ్యక్షుడు నర్రా సునీల్‌తో పాటు పలువురు వ్యాపారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news