విశాఖపట్నం వేదికగా తొలిసారి ఐఏటీఓ జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగే 41వ జాతీయ సదస్సుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సదస్సుతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాచుర్యం లభించే అవకాశం ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. జాతీయ స్థాయి పర్యాటక ప్రతినిధులు, నిర్వాహకులు విశాఖకు రానుండటంతో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రచారం లభించే అవకాశం ఉందన్నారు.
ఏపీలోని పర్యాటక నిర్వాహకులకు ఐఏటీఓ సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తున్నామని మంత్రి దుర్గేష్ ప్రకటించారు. సాధారణంగా సభ్యత్వం కోసం చెల్లించాల్సిన రూ.10 వేల రుసుమును రాష్ట్రంలోని పర్యాటక నిర్వాహకులకు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో స్థానిక పర్యాటక నిర్వాహకులకు జాతీయ స్థాయిలో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
విశాఖలో జరుగుతున్న ఈ జాతీయ సదస్సు ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి కొత్త ఊపు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలోని పర్యాటక రంగ ప్రముఖులు ఒకే వేదికపై సమావేశం కావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటక అవకాశాలు, ప్రాంతాలపై విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది.
Fetching videos...
Fetching latest news...
No trending news