ఆంధ్రప్రదేశ్‌లో నూతన రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. విజయవాడలో మాట్లాడిన ఆయన టీడీపీ, వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రెండు పార్టీలు ఫ్యాక్షన్ పార్టీలుగా మారిపోయాయని, కుటుంబ రాజకీయాలకు పరిమితమయ్యాయని ఆరోపించారు. టీడీపీని ‘రెడ్‌బుక్ పార్టీ’, వైసీపీని ‘రప్పా రప్పా పార్టీ’గా అభివర్ణించారు.
టీడీపీ, వైసీపీలకు దందాలు, సెటిల్మెంట్లు అలవాటుగా మారాయని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో తమిళనాడు తరహా రాజకీయాలు కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేసి గెలిచిన తర్వాత ప్రజల నుంచి దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కుటుంబ రాజకీయాలు, ఫ్యాక్షన్ ధోరణులు, దందాలు, సెటిల్మెంట్లకు భిన్నంగా కొత్త రాజకీయ విధానంతో ముందుకు వస్తామని తెలిపారు. త్వరలోనే నూతన పార్టీ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు ప్రకటించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news