తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 24న విద్యాసంస్థల బంద్‌కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. ఎన్ఎస్యూఐ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్డీఎస్, ఏఐఎస్బీ, ఏఐపీఎస్యూ తదితర విద్యార్థి సంఘాలు సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.
నీట్ పేపర్ లీకేజీ కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే ఢిల్లీలో ఆందోళన చేపట్టిన యువతపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించాయి.
ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ తెలంగాణ అధ్యక్షుడు యడవల్లి వెంకటస్వామి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు బంద్‌కు సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమానికి మద్దతు తెలపాలని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
విద్యార్థుల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలపాలని కూడా విద్యార్థి సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ బంద్ నేపథ్యంలో విద్యాసంస్థలు, విద్యార్థులు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news