మనుబోలు మండలం పిడూరు దళితవాడలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి నూతన ఉత్సవ విగ్రహాల ఆవిష్కరణ, కుంభాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆలయానికి చేరుకుని చెన్నకేశవ స్వామిని దర్శించుకున్నారు.
దేవదేవేరులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆలయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
నూతన ఉత్సవ విగ్రహాల ఆవిష్కరణ, కుంభాభిషేక మహోత్సవం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే సోమిరెడ్డి పాల్గొనడంతో భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news