విజయవాడ నుంచి నెల్లూరుకు డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ చేరుకుంది. నేడు సోమశిల జలాశయాన్ని కమిటీ సభ్యులు పరిశీలించనున్నారు. కమిటీ చైర్మన్గా గోపాలరెడ్డి, నిపుణులుగా వెంకటేశ్వర్లు, శ్రీకాంత్ ఉన్నారు. జలాశయంలో డ్యామ్ భద్రత, నిర్మాణ నాణ్యత, ప్రస్తుత స్థితిగతులను నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
సోమశిల జలాశయానికి సంబంధించిన భద్రతా అంశాలను పరిశీలించడంతో పాటు జలాశయం ప్రస్తుత పరిస్థితి, నిర్మాణంలో ఉన్న కీలక భాగాలు, భద్రతకు సంబంధించిన ఇతర అంశాలను కమిటీ సభ్యులు పరిశీలించే అవకాశం ఉంది. సాంకేతికంగా జలాశయం పరిస్థితిని అంచనా వేసి, అవసరమైన సూచనలు, సిఫారసులను రూపొందించనున్నారు.
పరిశీలన ప్రక్రియ పూర్తయిన అనంతరం కమిటీ సమగ్ర నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనుంది. జలాశయ భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, అవసరమైన మరమ్మతులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన జాగ్రత్తలపై నివేదికలో సూచనలు ఉండే అవకాశం ఉంది. నిపుణుల కమిటీ పర్యటన నేపథ్యంలో సోమశిల జలాశయం వద్ద అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఇదిలా ఉండగా, రేపు, ఎల్లుండి కండలేరు జలాశయాన్ని కూడా ఇదే నిపుణుల కమిటీ పరిశీలించనుంది. రెండు జలాశయాల భద్రత, నాణ్యత, నిర్మాణ పరిస్థితులను సమగ్రంగా అంచనా వేసి ప్రభుత్వాలకు నివేదిక అందించనుంది. వరుసగా సోమశిల, కండలేరు జలాశయాల పరిశీలన చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Fetching videos...
Fetching latest news...
No trending news