కాకినాడలో నిందితుడు సాదిక్ ఖాన్‌ను మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు ప్రత్యేక మొబైల్ కోర్టు అనుమతి ఇచ్చింది. సాదిక్ ఖాన్‌ను వారం రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని సర్పవరం పోలీసులు కోర్టును కోరగా.. విచారణ అనంతరం మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
జగదీష్‌రెడ్డి హత్య కేసుతో పాటు ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులోనూ సాదిక్ ఖాన్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రెండు కేసుల్లో కీలక వివరాలను రాబట్టేందుకు, దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పోలీసులు అతడిని కస్టడీలో విచారించనున్నారు.
మూడు రోజుల పోలీస్ కస్టడీలో సాదిక్ ఖాన్ నుంచి కేసులకు సంబంధించిన కీలక సమాచారం సేకరించే అవకాశం ఉంది. నిందితుడి వాంగ్మూలం, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ రెండు కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news