రాజమహేంద్రవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. పేపర్‌మిల్లు నుంచి పెనాల్టీలు, పన్నులు ఎలా వసూలు చేయాలో సంబంధిత మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బాగా తెలుసని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తగిన విధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేయడమే తమ పార్టీ ప్రధాన అజెండా అని పురందేశ్వరి వెల్లడించారు. కూటమి పార్టీల మధ్య సీట్ల కేటాయింపులో ప్రత్యేక ఫార్ములా అంటూ ఏదీ లేదని స్పష్టం చేశారు. భాగస్వామ్య పార్టీలతో సమన్వయం చేసుకుంటూ సీట్ల పంపకం జరుగుతుందని తెలిపారు.
సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందించడమే బీజేపీ లక్ష్యమని పురందేశ్వరి చెప్పారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news