చైనా మాస్టర్స్ ఛాంపియన్లుగా నిలిచిన సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. చైనా జోడీపై అద్భుత పునరాగమన విజయంతో భారత్‌కు చారిత్రక టైటిల్‌ను అందించారని కొనియాడారు. 11-21, 21-13, 21-17తో హీ జి టింగ్–రెన్ షియాంగ్ యూ జోడీపై విజయం సాధించినట్లు తెలిపారు.
చైనా మాస్టర్స్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయులుగా సాత్విక్-చిరాగ్ చరిత్ర సృష్టించారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మ్యాచ్‌లో పోరాట పటిమ, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించి అద్భుత విజయాన్ని సాధించారని ప్రశంసించారు. కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించి పుంజుకున్న తీరు భారత బ్యాడ్మింటన్ సత్తాను ప్రపంచానికి చాటిందన్నారు.
సాత్విక్-చిరాగ్ జోడీ సాధించిన విజయం భారత క్రీడా రంగానికి గర్వకారణమని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఛాంపియన్లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ అంతర్జాతీయ వేదికలపై మరిన్ని విజయాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news