తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఇటీవల నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓపెన్ చెస్ టోర్నమెంట్–2026లో నారాయణ గోమతి సీబీఎస్ఈ పాఠశాలకు చెందిన మూడో తరగతి విద్యార్థి కరేటి నివాన్ష్ రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటి మూడో బహుమతిని సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చాడు.
విద్యతో పాటు విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నారాయణ విద్యా సంస్థలు వివిధ క్రీడా రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. నారాయణ గ్రూప్ జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, క్లస్టర్ ప్రిన్సిపాల్ కాంతి సూచనలు, ప్రోత్సాహంతో పాఠశాలలో విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ, ప్రోత్సాహం అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
చిన్న వయసులోనే రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో ప్రతిభ చూపించి మూడో బహుమతి సాధించడం అభినందనీయమని పాఠశాల ప్రిన్సిపాల్ పవనార్క్, వైస్ ప్రిన్సిపాల్ సౌమ్య రెడ్డి పేర్కొన్నారు. నివాన్ష్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విజయాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news