మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన లీడర్షిప్ కాంక్లేవ్‌లో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పొలిట్‌బ్యూరో సభ్యులు, జోనల్ ఇన్చార్జులు హాజరయ్యారు.
కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నాయకులంతా సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి ప్రసంగం, మార్గనిర్దేశం ఎంతో స్ఫూర్తినిచ్చాయని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పేర్కొన్నారు. చంద్రబాబు సూచించిన మార్గంలో ముందుకు సాగుతూ సూళ్లూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి మరింత అంకితభావంతో కృషి చేస్తానని ఆమె తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా పనిచేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news