ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ నిర్వహిస్తున్నామని నందిగామ ఆర్డీవో జి. అనిల్ కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆయన ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ నిర్వహించగా మొత్తం 15 వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు.
శాఖల వారీగా పరిశీలిస్తే రెవెన్యూ శాఖకు సంబంధించి 10, విద్యుత్ శాఖకు 2, పంచాయతీరాజ్ శాఖకు 1, పౌర సరఫరాల శాఖకు 1, పోలీస్ శాఖకు 1 ఫిర్యాదు అందాయి. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించాలని ఆర్డీవో అనిల్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల్లో పేర్కొన్న అంశాలపై వాస్తవ పరిస్థితిని పరిశీలించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news