జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. గత రాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు ముందుగా సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి, అనంతరం చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న సుమారు 15 గ్రాముల బంగారం, 10 కిలోల వెండిని అపహరించారు.
సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న సిబ్బంది చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆలయాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. క్లూస్ టీంతో కలిసి చోరీకి సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
ఆలయంలోని సీసీ కెమెరాల వైర్లను దుండగులు కట్ చేయడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇతర ఆధారాలను సేకరిస్తూ నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఆలయంలో చోరీకి పాల్పడిన వారిని త్వరగా పట్టుకుని, అపహరించిన బంగారం, వెండిని స్వాధీనం చేసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news