మంగళగిరిలో జరుగుతున్న టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్‌లో మంత్రి నారా లోకేష్ పార్టీ నాయకత్వం, క్రమశిక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీయే సుప్రీం’ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. పార్టీ బలంగా ఉంటేనే నాయకులు, ప్రజాప్రతినిధులు మరింత సమర్థవంతంగా పనిచేయగలరని పేర్కొన్నారు.
పార్టీ పదవుల్లో ఉన్నవారు, ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయాలను గౌరవించాలని లోకేష్ సూచించారు. వ్యక్తిగత అభిప్రాయాలు, ప్రాధాన్యతల కంటే పార్టీ ప్రయోజనాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా నాయకులు సమష్టిగా పనిచేయాలని అన్నారు.
పార్టీ ఏదైనా పని అప్పగిస్తే దానికే ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలని నారా లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలను బాధ్యతగా స్వీకరించి క్షేత్రస్థాయిలో అమలు చేయడం ద్వారా టీడీపీని మరింత బలోపేతం చేయాలని నేతలకు సూచించారు. పార్టీ క్రమశిక్షణ, ఐక్యతతోనే భవిష్యత్‌లో మరింత విజయవంతంగా ముందుకు సాగగలమని ఆయన పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news