కొండాపురం బీసీ బాలుర హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న కనీస వసతుల కొరతను పరిష్కరించాలని బీజేపీ నాయకులు అధికారులను కోరారు. అలాగే కొండాపురం–కలిగిరి రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. జనతా వారధి కార్యక్రమంలో భాగంగా కొండాపురం మండల బీజేపీ అధ్యక్షుడు జడపల్లి మహేష్ ఈ రెండు సమస్యలను గ్రీవెన్స్‌లో నమోదు చేసి ఎంపీడీవో ఆదినారాయణకు ఫిర్యాదు చేశారు.
హాస్టల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, రహదారి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కోరారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హాస్టల్ సమస్యలపై ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చైతన్య, ఉపాధ్యక్షుడు కూకట్ల కృష్ణరావు, కార్యదర్శి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news