టీడీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన లీడర్షిప్ కాంక్లేవ్‌లో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, ప్రజా పాలన, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లడం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు.
కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేయడంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని దిశానిర్దేశం చేశారు.
పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు చురుగ్గా వ్యవహరించడం, రాబోయే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంపై సమావేశంలో నాయకులకు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పొలిట్‌బ్యూరో సభ్యులు, జోనల్ ఇన్చార్జులు, జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news