శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని పరిశుభ్రతతో పాటు అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఇంధన పొదుపు సందేశాన్ని కూడా ప్రజలకు వివరించారు.
జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్‌తో ప్రయాణించడం విశేషంగా నిలిచింది. ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర పిలుపుకు అనుగుణంగా నాయకులు కూడా ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తామని సీఎం తెలిపారు. పెట్టుబడుల ద్వారా ఈ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు రానున్నాయని, దాంతో ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు తగ్గుతాయని పేర్కొన్నారు. అలాగే మూడేళ్లలో నేరడి బ్యారేజ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ పేరుతో రహదారుల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతను పెంచేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆయన సూచించారు.
‘స్వచ్ఛ పథం’ కార్యక్రమం ద్వారా రహదారులను పూర్తిగా శుభ్రంగా ఉంచే చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. అభివృద్ధి, పరిశుభ్రత రెండూ సమానంగా ముందుకు సాగితేనే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.

Fetching videos...
Fetching latest news...
No trending news