కాకినాడ జిల్లాలో గూడ్స్ రైలు నుంచి యూరియా బస్తాలను చోరీ చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు యత్నించిన ఘటన కలకలం రేపింది. సామర్లకోట మండలం ఉండూరు సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సిగ్నల్ కోసం రైల్వే గేట్ వద్ద గూడ్స్ రైలు నిలిచివుండగా, దుండగులు ఒక బోగీ తాళం పగులగొట్టి అందులోని యూరియా బస్తాలను బయటకు దింపేందుకు ప్రయత్నించారు.
దుండగులు సుమారు 60 యూరియా బస్తాలను బోగీ నుంచి కిందకు దింపినట్లు సమాచారం. రైల్వే సిబ్బంది అనుమానాస్పద కదలికలను గమనించి వెంటనే రైల్వే భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే రక్షణ దళం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.
పోలీసులు వస్తున్నారని గమనించిన దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు, చోరీ యత్నానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. రైల్వే ఆస్తుల భద్రతపై మరింత నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news