శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు సర్కిల్ పోలీసు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను పోలీసులు విచారిస్తున్నారు.
ఉదయం నుంచి కొనసాగుతున్న ఈ విచారణలో పోలీసులు దువ్వాడ శ్రీనివాస్‌ను పలువురు అంశాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐదు గంటలకు పైగా విచారణ కొనసాగుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉండగా, దువ్వాడ శ్రీనివాస్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన అనుచరులు పోలీసు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. దువ్వాడ మాధురి కూడా అనుచరులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆందోళన తీవ్రరూపం దాల్చే అవకాశముందని భావించిన పోలీసులు దువ్వాడ మాధురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news