గుంటూరు జిల్లాలోని చేబ్రోలు ప్రాంతానికి చెందిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. శనివారం పాఠశాలకు వెళ్లిన తుపాకుల గోపి, రాయల భరత్, జమీర్ అహ్మద్ అనే విద్యార్థులు తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు స్థానికంగా ఉన్న చాణక్య పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నట్లు సమాచారం. పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపడుతుండగా, పిల్లలు ఢిల్లీలో ఉన్నారనే సమాచారం కుటుంబ సభ్యులకు అందినట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతో తల్లిదండ్రులు ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. విద్యార్థుల ఆచూకీపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు పిల్లలు క్షేమంగా తిరిగి రావాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news