మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సెప్టెంబర్ 7, 8 తేదీల్లో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అత్యున్నత స్థాయి లీడర్షిప్ కాంక్లేవ్‌లో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య ప్రసంగాలు చేశారు.
ఈ కీలక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, పొలిట్‌బ్యూరో సభ్యులు, జోనల్ ఇన్‌చార్జ్‌లతో కలిసి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడం వంటి అంశాలపై కాంక్లేవ్‌లో చర్చలు జరిగాయి.
ప్రజా సంక్షేమ పథకాల అమలును మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడం, ప్రజలకు ప్రభుత్వ ప్రయోజనాలు చేరేలా చర్యలు చేపట్టడం, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నాయకత్వంతో కలిసి మాలకొండయ్య చర్చించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, నాయకత్వ బాధ్యతలు, ప్రజలతో మరింత మమేకం కావాల్సిన అంశాలపై కాంక్లేవ్‌లో దిశానిర్దేశం కొనసాగింది.
Fetching videos...
Fetching latest news...
No trending news