ఉపాధ్యాయులపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఏమాత్రం గౌరవం లేదని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో దేవుళ్లలాంటి గురువులను వైన్‌షాపుల వద్ద క్యూలైన్లలో నిలబెట్టి అవమానించారని ఆరోపించారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ మధ్య కనీస తేడా కూడా తెలియని వ్యక్తి జగన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని చింతకాయల విజయ్ ఆరోపించారు. ఐదేళ్లలో సుమారు 12 లక్షల మంది విద్యార్థులు బడికి దూరమయ్యారని అన్నారు. ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ పోస్టును కూడా భర్తీ చేయని వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ఇప్పుడు విద్య, ఉపాధ్యాయుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
16 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగుల పట్ల మంత్రి నారా లోకేష్ తన చిత్తశుద్ధిని చాటుకున్నారని విజయ్ పేర్కొన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, గతంలో ఎక్కడైతే ఓడారో అక్కడే గెలిచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని లోకేష్‌ను ప్రశంసించారు.
చట్టసభలకు వచ్చి ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకపోయినా.. విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ జగన్ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని చింతకాయల విజయ్ విమర్శించారు. కుప్పంలో పాఠాలు చెబుతున్న మాజీ ఆర్మీ ఉపాధ్యాయుడిని సాక్షి రిపోర్టర్‌తో బెదిరించడం దారుణమని అన్నారు. బడుగు, బలహీన వర్గాలను అణిచివేయాలని చూస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏకమై వైఎస్సార్సీపీని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news