చైనా మాస్టర్స్ 2026లో పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుని చారిత్రక విజయం సాధించిన సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. షెన్జెన్ వేదికగా భారత జోడీ సాధించిన విజయం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. చైనా మాస్టర్స్ టైటిల్‌ను గెలిచిన తొలి భారత జోడీగా సాత్విక్-చిరాగ్ చరిత్ర సృష్టించారని అభినందించారు.
ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమైన సాత్విక్‌సాయిరాజ్‌తో పాటు కిడాంబి శ్రీకాంత్‌ను కూడా చంద్రబాబు ప్రశంసించారు. ప్రపంచ వేదికపై భారత క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సాత్విక్-చిరాగ్ అద్భుత ప్రదర్శన భారత బ్యాడ్మింటన్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని ఎక్స్ వేదికగా సీఎం పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news