మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ లీడర్షిప్ కాన్క్లేవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పొలిట్‌బ్యూరో సభ్యులు, జోనల్ ఇన్ఛార్జ్లు కూడా కాన్క్లేవ్లో పాల్గొన్నారు.
సుస్థిర అభివృద్ధి, ప్రజాసేవ, రాజకీయ సమాచార వ్యవస్థ, సుపరిపాలన వంటి అంశాలపై కార్యక్రమంలో చర్చించారు. అలాగే ఎల్‌నినో ప్రభావంపై అవగాహన, దాని వల్ల ఎదురయ్యే పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం వంటి అంశాలపైనా నేతలు చర్చించనున్నారు.
టీడీపీ నాయకుల్లో నాయకత్వ సామర్థ్యాలను మరింత పెంపొందించడం, ప్రజలకు మరింత చేరువగా పనిచేయడం, ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజాసేవకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరంపై కూడా సమావేశంలో మార్గనిర్దేశం చేయనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగించడం వంటి అంశాలు ఈ కాన్క్లేవ్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాయకత్వ లక్షణాలు, రాజకీయ కమ్యూనికేషన్, సుపరిపాలనపై అవగాహన పెంచుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని చంద్రబాబు సూచనలు ఇవ్వనున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news