మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వారికి ఘన స్వాగతం పలికారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా వారికి ఆత్మీయ స్వాగతం పలికారు.
అనంతరం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి చంద్రబాబు, లోకేష్, పల్లా శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఆశయాలను స్మరించుకుంటూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే దిశగా నేతలు సంకల్పం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లీడర్షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ తొలి రోజు కార్యక్రమంలో చంద్రబాబు, లోకేష్ పాల్గొన్నారు. పార్టీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడం, నాయకుల్లో సామర్థ్యాన్ని పెంపొందించడం, ప్రజల సమస్యలపై సమర్థవంతంగా పనిచేసేలా శిక్షణ అందించడం వంటి అంశాలపై కాంక్లేవ్‌లో చర్చలు కొనసాగుతున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news