అమరావతిలో నిర్వహిస్తున్న టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానంలో అనుసరించిన విధానాలను వివరించారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి తాను చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. ఉదయం నుంచి పొద్దుపోయే వరకు మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతూ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నించేవాళ్లమని తెలిపారు.
సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యోగులు, అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేవాళ్లమని చంద్రబాబు చెప్పారు. ప్రజల సమస్యలపై నిరంతరం దృష్టి పెట్టి, వాటి పరిష్కారం కోసం స్వీయ ప్రేరణతో పనిచేసేవాళ్లమని వివరించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టకుండా పట్టుదలతో పనిచేయడమే తమ విధానమన్నారు.
ప్రజలతో నిత్యం మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకోవడం, పరిష్కార మార్గాలను అన్వేషించడం ద్వారా నాయకత్వాన్ని బలోపేతం చేసుకున్నామని చంద్రబాబు వెల్లడించారు. అదే సమయంలో కొత్త నాయకులను తీర్చిదిద్దుతూ, వారిలో బాధ్యత, పట్టుదల, ప్రజల పట్ల నిబద్ధత పెంపొందించామని తెలిపారు. ఈ విధానాలే తనను ఈ స్థాయికి తీసుకువచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news