వల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బీటెక్ విద్యార్థి సాయి ప్రణవ్ శర్మ కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు అతడిని కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. విద్యార్థి కనిపించకుండా పోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే వల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా సాయి ప్రణవ్ శర్మను తీసుకెళ్లిన కారు కదలికలను పోలీసులు గుర్తించారు. పోలీసులు వెంబడిస్తున్న విషయాన్ని గమనించిన కిడ్నాపర్లు వారి వాహనాన్ని ఢీకొట్టేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసు బృందాలు వ్యూహాత్మకంగా వ్యవహరించి కిడ్నాపర్లు ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నారు.
అనంతరం కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి చెరలో ఉన్న సాయి ప్రణవ్ శర్మను సురక్షితంగా రక్షించారు. కిడ్నాపర్లను వల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. విద్యార్థిని ఎందుకు కిడ్నాప్ చేశారు, ఈ ఘటన వెనుక అసలు కారణం ఏమిటి, మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news