మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న రెండు రోజుల లీడర్షిప్ కాంక్లేవ్ శిక్షణ తరగతుల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. పార్టీ నాయకత్వ పటిమను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రెండు రోజుల శిక్షణలో పార్టీ సిద్ధాంతాలను నాయకులు, కార్యకర్తలకు మరింతగా అవగాహన కల్పించడంతో పాటు ప్రజలతో సమర్థవంతంగా మమేకమయ్యే విధానాలపై చర్చిస్తున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని తీర్చిదిద్దడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
అదేవిధంగా కార్యకర్తలతో సమన్వయం, పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం, క్షేత్రస్థాయిలో పార్టీ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై శిక్షణ అందిస్తున్నారు. నాయకులు, కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను మరింతగా పెంపొందించి, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే ఈ లీడర్షిప్ కాంక్లేవ్ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news