విజయవాడ మొగల్రాజపురంలో టీడీపీ యువ నాయకుడు, ప్రముఖ న్యాయవాది బొండా రవితేజ వికలాంగులకు అండగా నిలుస్తున్నారు. 25వ డివిజన్‌కు చెందిన టీ. హరిణి, వీ. నరసింహారావులకు ప్రతినెలా తన సొంత నిధులతో అందిస్తున్న పెన్షన్‌ను సోమవారం ఆయన అందజేశారు. ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నివాసం వద్ద ఈ కార్యక్రమం జరిగింది.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలు, వికలాంగులకు అండగా నిలవడం తమ కుటుంబం ఎప్పుడూ బాధ్యతగా భావిస్తుందని బొండా రవితేజ తెలిపారు. టీ. హరిణికి నెలకు రూ.4,000, వీ. నరసింహారావుకు నెలకు రూ.4,000 చొప్పున సొంత పెన్షన్ అందిస్తున్నామని వెల్లడించారు. అవసరంలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించడం, వారి కష్టాల్లో తోడుగా నిలవడమే నిజమైన ప్రజాసేవ అని పేర్కొన్నారు.
పేద ప్రజల జీవితాల్లో భరోసా కల్పించేలా తమ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని బొండా రవితేజ తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే తమ కుటుంబం లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ అధ్యక్షుడు మాచర్ల గోపి, దొంగర ఆంజనేయులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news