మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్షిప్ కాంక్లేవ్‌లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. నారా లోకేష్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పొలిట్‌బ్యూరో సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జులు పాల్గొన్నారు.
కాంక్లేవ్‌లో బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల సమస్యలు, అభివృద్ధి అవసరాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలకు మెరుగైన పాలన, మౌలిక వసతులు అందేలా కృషి చేయాల్సిన అంశాలను వివరించారు.
ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చూపిన బాటలోనే శ్రీకాళహస్తిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికీ చేరేలా కృషి చేస్తానన్నారు. పార్టీ బలోపేతంలో ప్రతి కార్యకర్తను భాగస్వామ్యం చేస్తూ ముందుకు సాగుతానని, శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ జెండాను మరింత ఎత్తుగా ఎగురవేస్తానని పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news