అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టుల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఏపీ జల్‌జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్’ను పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకి చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్వహణ, అమలులో మరింత సమన్వయం ఏర్పడనుంది.
నిధుల సమీకరణతో పాటు తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పనులను వేగవంతంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కార్పొరేషన్‌కు స్వయంప్రతిపత్తి హోదా కల్పించింది. ప్రాజెక్టుల అవసరాలకు అనుగుణంగా నిధులు సమీకరించడం, పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాల్లో కార్పొరేషన్‌కు మరింత స్వేచ్ఛ లభించనుంది.
పంచాయతీరాజ్ శాఖ పరిధిలో కార్పొరేషన్ కొనసాగడంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి మౌలిక వసతుల అభివృద్ధికి మరింత ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని తాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఆసక్తి నెలకొంది.
Fetching videos...
Fetching latest news...
No trending news