ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో ఆయా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. (Prime9 News)
వర్షాల సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు, రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా రైతులు, కూలీలు వర్షం, ఉరుములు, పిడుగుల సమయంలో పొలాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. పిడుగులు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, తాత్కాలిక షెడ్ల వద్ద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
గురజాల, మాచర్ల, దర్శి, కందుకూరు, ఒంగోలు, బాపట్ల, గుంటూరు, పిడుగురాళ్ల, నరసరావుపేట, చిలకలూరిపేట తదితర ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితి ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కోరారు. (Prime9 News)
Fetching videos...
Fetching latest news...
No trending news