ఆదోని మున్సిపల్ ఉద్యోగిని నరసమ్మపై జరిగిన పెట్రోల్ దాడి ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిన్న తెల్లవారుజామున నరసమ్మపై మహిళలు దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ముందుగా ఆమె కళ్లలో కారం చల్లి, అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు వెల్లడించారు.
ఈ దాడిలో నరసమ్మ తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాల కారణంగా నరసమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మున్సిపల్ ఉద్యోగినిపై జరిగిన ఈ దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన కారణాలు, నిందితుల పాత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపట్టారు.
Fetching videos...
Fetching latest news...
No trending news