కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆరోపణలు తమిళనాట తీవ్ర చర్చకు దారితీశాయి. చెన్నైలోని నీలాంకరైలో ఉన్న తన నివాసంలో దొంగతనం జరిగిందనే అనుమానంతో ఇంట్లో పనిచేసే ఇద్దరు మహిళలు, ఓ బాలుడిని అక్రమంగా నిర్బంధించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. పనికి వెళ్లిన తమ కుటుంబ సభ్యులు చాలా సేపైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు జయం రవి ఇంటికి వెళ్లి చూడగా, వారిని బయటకు రానివ్వడం లేదని గుర్తించినట్లు సమాచారం. వెంటనే వారిని విడుదల చేయాలని కోరినా నిరాకరించడంతో కుటుంబ సభ్యులు నీలాంకరై పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పనివాళ్లను బయటకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం జయం రవితో మాట్లాడి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై జయం రవి లేదా ఆయన ప్రతినిధుల నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. పోలీసులు కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Fetching videos...
Fetching latest news...
No trending news