HomeLatest-newsస్ట్రాబెర్రీ మూన్ జూన్ 29న సందడి.. ఈ టైమ్లో తప్పక..
స్ట్రాబెర్రీ మూన్ జూన్ 29న సందడి.. ఈ టైమ్లో తప్పక చూడండి
Updated 1 hours ago
జూన్ నెలాఖరులో ఆకాశంలో కనువిందు చేయనున్న స్ట్రాబెర్రీ మూన్ కోసం ఖగోళ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 29-30 రాత్రి కనిపించే ఈ పౌర్ణమి చంద్రుడు సాధారణం కంటే పెద్దగా, బంగారు లేదా నారింజ రంగు ఛాయలో మెరిసేలా కనిపించనుంది. అయితే ఇది నిజంగా రంగు మారడం వల్ల కాదు. చంద్రుడు క్షితిజానికి దగ్గరగా ఉండటం, భూమి వాతావరణం గుండా కాంతి ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల ఈ దృశ్యం ఏర్పడుతుంది. దీనినే మూన్ ఇల్యూషన్ అంటారు. 'స్ట్రాబెర్రీ మూన్' అనే పేరు ఉత్తర అమెరికాలోని అల్గాంక్విన్ తెగల సంప్రదాయం నుంచి వచ్చింది. జూన్లో అడవి స్ట్రాబెర్రీ పండ్ల కోత ప్రారంభమయ్యే కాలం కావడంతో ఈ పౌర్ణమికి ఆ పేరు పెట్టారు. భారత్లో జూన్ 29 రాత్రి 11:57 గంటలకు పౌర్ణమి గరిష్ఠ దశకు చేరుకోగా, జూన్ 30 తెల్లవారుజాము వరకు పూర్తి ప్రకాశంతో కనిపిస్తుంది. ముఖ్యంగా చంద్రోదయం తర్వాత వెంటనే చూస్తే ఈ అద్భుతమైన ఆకాశ దృశ్యాన్ని అత్యంత స్పష్టంగా ఆస్వాదించవచ్చని ఖగోళ నిపుణులు సూచిస్తున్నారు.