2026 ఆగస్టు నెల ఖగోళ, ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. కేవలం 15 రోజుల వ్యవధిలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సంభవించనుండగా, అవి హిందువులు అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసంలోని ముఖ్యమైన రోజుల్లో రావడం విశేషం. ఆగస్టు 12న శ్రావణ అమావాస్య రోజున కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడనుండగా, ఇది ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించనుంది. అనంతరం ఆగస్టు 28న రక్షాబంధన్ రోజున పాక్షిక చంద్రగ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణంలో చంద్రుని దాదాపు 96 శాతం భాగం భూమి నీడలోకి వెళ్లనుంది. పండుగల రోజునే గ్రహణాలు రావడంతో పూజలు, ఆచారాలు, ముహూర్తాలపై భక్తుల్లో ఆసక్తి నెలకొంది. అయితే గ్రహణాల ప్రభావం అవి కనిపించే ప్రాంతాలపైనే ప్రధానంగా ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత్లో ఈ గ్రహణాల దర్శనంపై ఆధారపడి సూతక కాలం, ఆలయ ఆచారాలు, పండుగల నిర్వహణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోనున్నారు. దీంతో ఈ రెండు ఖగోళ సంఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news