వర్షంలో డెలివరీ బాయ్‌కు అండగా వృద్ధుడు.. వైరల్ వీడియో
Updated 1 hours ago
వర్షంలో తడిసిపోయిన నోట్లతో పెట్రోల్ కొనలేక ఇబ్బంది పడుతున్న ఓ డెలివరీ బాయ్‌కు అపరిచిత వృద్ధుడు చేసిన సహాయం సోషల్ మీడియాలో హృదయాలను గెలుచుకుంటోంది. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వర్షానికి తడిసిన నోట్లను పెట్రోల్ బంక్ సిబ్బంది స్వీకరించకపోవడంతో, తన వద్ద స్మార్ట్‌ఫోన్ లేక యూపీఐ చెల్లింపు కూడా చేయలేనని డెలివరీ బాయ్ వివరించాడు. ఈ దృశ్యాన్ని గమనించిన వెనుక క్యూలో ఉన్న వృద్ధుడు వెంటనే స్పందించి, యువకుడికి అవసరమైన రూ.80 విలువైన పెట్రోల్‌ను తన ఖర్చుతో వేయించాలని సిబ్బందిని కోరాడు. అయితే, అతను చెప్పిన ఒక మాటే అందరి మనసులను తాకింది. “ఈరోజు నేను నీకు సహాయం చేశాను.. రేపు అవకాశం వచ్చినప్పుడు నువ్వూ మరొకరికి సహాయం చేయి” అంటూ మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచాడు. చిన్న సహాయం కూడా జీవితాల్లో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తూ నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.