బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని ముంబయిలోని ఐకానిక్ నివాసం ‘అద్వితీయ’ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె కుమార్తె ఈషా దేఓల్ ప్రత్యేక హోమ్ టూర్ ద్వారా ఈ ఇంటి విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. దాదాపు 54 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బంగ్లాకు శ్రీ శ్రీ రవిశంకర్ సూచన మేరకు ‘అద్వితీయ’ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. మార్బుల్ ఫ్లోరింగ్, అద్దాల గోడలు, ఆకర్షణీయమైన షాండ్లియర్లు, కుటుంబ ఫొటోలు, పాత సినిమా జ్ఞాపకాలతో ఇల్లు ఎంతో ప్రత్యేకంగా అలరించింది. ముఖ్యంగా ధర్మేంద్ర–హేమమాలిని ఫొటోలతో అలంకరించిన ప్రత్యేక సోఫాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ ఇంటిలో అత్యంత ప్రత్యేకమైన ప్రదేశం హేమమాలిని క్లాసికల్ డ్యాన్స్ సాధన చేసే డ్యాన్స్ హాల్. పాలిష్ చేసిన చెక్క ఫ్లోరింగ్‌తో ఉన్న ఈ హాల్లోకి చెప్పులు వేసుకుని ఎవరినీ అనుమతించరని ఈషా వెల్లడించారు. నృత్యకళ పట్ల గౌరవ సూచకంగానే ఈ నియమాన్ని పాటిస్తున్నామని చెప్పారు. అలాగే తాను చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్ ఆడి జాతీయ జట్టుకు కూడా ఎంపికయ్యానని ఈషా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news