Homeసినిమాజగడం' గుర్తుంచుకోండి.. డ్రగ్స్‌కు దూరంగా ఉండండి: ర..
జగడం' గుర్తుంచుకోండి.. డ్రగ్స్‌కు దూరంగా ఉండండి: రామ్
Updated 2 hours ago
అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో హీరో రామ్ పోతినేని యువతకు ఆలోచింపజేసే సందేశం ఇచ్చారు. డ్రగ్స్ ఒకసారి అలవాటైతే దాని నుంచి బయటపడటం ఎంత కష్టమో తనకు ఎదురైన నిజ జీవిత సంఘటనను వివరించారు. విదేశాల్లో డ్రగ్స్‌కు బానిసైన ఓ వ్యక్తిని కలిసినప్పుడు, "డ్రగ్స్ వల్ల నీ జీవితం ఎలా మారింది?" అని అడగగా, "ఇంకా 80 ఏళ్లు ఇలాగే బతకాలా?" అని అతడు చెప్పిన సమాధానం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆ ఒక్క మాట డ్రగ్స్ మనిషి జీవితాన్ని ఎంత దారుణంగా మార్చేస్తుందో అర్థమయ్యేలా చేసిందని తెలిపారు. "YOLO (You Only Live Once)" అంటూ జీవితాన్ని నిర్లక్ష్యంగా తీసుకోవద్దని, ఎవరైనా "ఒక్కసారి ట్రై చేయ్" అని డ్రగ్స్‌కు ప్రలోభపెడితే ధైర్యంగా "నో" చెప్పాలని యువతకు సూచించారు. తన 'జగడం' సినిమాలో చూపించినట్లే, ఒకసారి చెడు దారిలోకి వెళితే తిరిగి మంచి మార్గంలోకి రావడం చాలా కష్టమని చెప్పారు. జీవితాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా గడపాలని, మంచి భవిష్యత్తు కోసం డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని రామ్ యువతకు పిలుపునిచ్చారు.