‘రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్-2026’లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యాలు, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి అని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు వేగవంతమైన నిర్ణయాలు, సమర్థవంతమైన అమలుకు ప్రాధాన్యత ఇచ్చే నాయకుడని పేర్కొన్న లోకేష్, వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని వెల్లడించారు.
పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని, వేగం, స్థిరత్వం, సేవలే రాష్ట్ర విజయానికి మూల సూత్రాలని వివరించారు. కేంద్ర రక్షణ రంగానికి సంబంధించిన కీలక ప్రాజెక్టుకు కేవలం 37 రోజుల్లోనే 600 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు. అలాగే ప్రముఖ సాంకేతిక సంస్థకు చెందిన డేటా కేంద్ర ప్రాజెక్టును కేవలం 13 నెలల్లోనే అమలు దశకు తీసుకువచ్చామని చెప్పారు.
కూటమి ప్రభుత్వానికి చెందిన ఎంపీలు అధిక సంఖ్యలో ఉండటం వల్ల జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాల కోసం బలంగా వాదించే అవకాశం లభిస్తోందని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామికీకరణ, ఉపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news